Rohit Sharma To Lead Team India In 2024 T20 World Cup: 2024 జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో కూడా రోహిత్ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచకప్లో భారత జట్టును నడిపించడానికి రోహితే సరైన వ్యక్తని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెలక్టర్లు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓటమి…
సౌదీ అరేబియా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఈరోజు భారత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియాను కలిశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడామన్నారు. అంతేకాకుండా.. హజ్ యాత్రను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించామని తెలిపారు.
India-Pak: ఇటీవల కాలంలో పాకిస్తాన్ యువతులు, ఇండియన్ అబ్బాయిలకు పడిపోతున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ యువతి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు వచ్చింది. కోల్కతాకు చెందిన వ్యక్తి సమీర్ ఖాన్ని పెళ్లి చేసుకునేందుకు కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ భారత్ వచ్చింది.మంగళవారం వాఘా-అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి భారతదేశానికి చేరుకుంది.. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. కాబోయే కోడలికి భర్త సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
2020ని ప్రపంచం ఎప్పటికీ మరవదు. అనూహ్యంగా మనమధ్యకు వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ పుట్టుక, మనుగడ తెలుసుకునేలోపే లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వ్యాక్సినేషన్లు రావడంతో కరోనా నుంచి ఉపశమనం లభించింది. క్రమంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా మాత్రం పోలేదు. ఇంకా మహమ్మారి మన మధ్యే ఉంది. రీసెంట్గా మరోసారి ఈ మహమ్మారి మరోసారి బయటకు వచ్చింది. యూకేలో మార్పు పొంది కొత్త వెరియంట్తో విజఈంభించేసుందుకు రెడీగా ఉంది.…
రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 నాలుగో మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించడంతో.. ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించింది యంగిస్థాన్. మరో మ్యాచ్ ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో టీ 20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది..
ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం కావడంతో నాసా చీఫ్ బిల్ నెల్సన్ ప్రశంసించారు. ఏ దేశం చేయని పనిని భారత్ చేసింది.. అందుకే ఈ ఘనత సాధించినందుకు అందరి ప్రశంసలు దక్కుతాయని ఆయన అన్నారు.
5 టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
రాయ్పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే భారత్.. 2-1 ఆధిక్యంలో ముందుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
COP28 Dubai: యూఏఈ దుబాయ్ వేదికగా COP28 సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ప్రపంచ ఉద్గారాలను తగ్గించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో కార్బన్ స్కిన్లను రూపొందించడంపై దృష్టి సారిచే ‘‘గ్రీన్ క్రెడిట్’’ స్కీమును ఆయన ప్రకటించారు.