Rohit Sharma: ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ! జట్టులో సగం మనోళ్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 Indians included in ICC Men’s ODI Team of the Year 2023: మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఏకంగా ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఈ ఎలైట్ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. 2023 సంవత్సరంలో అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఎంపికయిన విషయం తెలిసిందే. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో తమకు తిరుగులేదని భారత క్రికెటర్లు మరోసారి నిరూపించారు.
2023లో వన్డేల్లో రోహిత్ శర్మ 52 సగటుతో 1255 పరుగులు చేశాడు. ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్‌పై 131 పరుగులు బాదాడు. అంతేకాకుండా భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. దాంతో అతడికి వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్సీ దక్కింది. ఐసీసీ జట్టులో సగానికి పైగా మనోళ్లే ఉన్నారు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలు 11 మందిలో చోటు దక్కించుకున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియాల నుంచి ఏకంగా 8 మంది ఐసీసీ జట్టుకు ఎంపికవ్వడం విశేషం.
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
Also Read: WPL 2024 Schedule: ఫిబ్రవరి 23న డబ్ల్యూపీఎల్ ఆరంభం.. మార్చి 17న ఫైనల్!
వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్‌సేన్, ఆడమ్ జంపా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ.
Eight players that featured in the #CWC23 Final have made the cut for the ICC Men’s ODI Team of the Year in 2023 ✨
Details 👇https://t.co/AeDisari9B
— ICC (@ICC) January 23, 2024
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?