Rohan Bopanna getting to World Number 1: 43 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న చరిత్ర సృష్టించాడు. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నం. 1గా నిలిచిన అతిపెద్ద వయసుకుడిగా బొప్పన్న నిలవనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024 ముగిసిన తర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో బొప్పన్న ఈ ఘనతను అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో బొప్పన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంతో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని పొందడం ఖాయం అయింది.
రోహన్ బోపన్న వయస్సుతో పాటు ఆటలో కూడా మెరుగవుతున్నాడు. బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కెరీర్-అత్యున్నత ర్యాంకింగ్ నంబర్. 3తో ప్రవేశించాడు. ఇప్పుడు సెమీస్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. వచ్చే వారం రిలీజ్ చేసే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 నిలవనున్నాడు. రోహన్ బోపన్నకు అత్యంత విజయవంతమైన భాగస్వాములలో ఒకరైన మాథ్యూ ఎబ్డెన్ పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 2 స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
Also Read: Rajat Patidar: పుజారా, సర్ఫరాజ్ కాదు.. కోహ్లీ స్థానంలో పాటిదార్!
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడి 6-4, 7-6 స్కోరుతో అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రూ మోల్టెనిపై గెలుపొందారు. గంటా 46 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహారిగా సాగింది. ఇక సెమీ ఫైనల్‌లో రెండో సీడ్ బోపన్న, ఎబ్డెన్‌లు అన్‌సీడెడ్ టోమస్ మచాక్, జిజెన్ జాంగ్‌తో తలపడనున్నారు. బోపన్న జోడి తొలి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై కన్నేశారు.