Indian American philanthropist: లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సురేష్ వి షెనాయ్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నది.. దేశంలో అవకాశాలకు కొదవలేదని అన్నారు. ఇక, భారత ఎన్నికల్లో భవిష్యత్తు గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి మోడీ అని అన్నారు. భవిష్యత్తులో టెక్నాలజీని దేశంలో ఏవిధంగా అమలు చేయనున్నారనే దానిపై ఆయన ప్రజల్లో చర్చిస్తున్నారు.. ప్రధాని మోడీ ఆలోచనకు సరితూగే నాయకుడు ప్రతిపక్షంలో లేరని భారత అమెరికన్ బిజినెస్ మెన్ షెనాయ్ తెలిపారు.
Read Also: Road Accident: ప్రకాశం జిల్లాలో బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు!
ఇక, హిందుత్వ దృక్కోణం నుంచి నేను ఈ విషయాన్ని చెప్పడం లేదని సురేష్ వి షెనాయ్ చెప్పారు. గత 10 ఏళ్లలో భారతదేశం ఆర్థిక రంగంలో చాలా పురోగతి సాధించింది.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత భారత ప్రజల యొక్క జీవితం ఎలా ఉంటుందో ప్రధాని మోడీ ముందే చెప్పారు.. ఆయన కేవలం భారత నాయకత్వం గురించి మాత్రమే కాదు జాతీయ నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు.. G 20 సదస్సు సందర్భంగా మోడీ ఇచ్చిన ‘ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం’ అనే సందేశం ప్రపంచానికి ఎంతగానో నచ్చింది.. అలాగే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా వర్తమానం మాత్రమే చర్చనీయాంశమైంది అని వ్యాపారవేత్త సురేష్ వి షెనాయ్ వెల్లడించారు.