Jaishankar: నిజ్జర్ హత్య కేసులో ‘సహకరించేందుకు భారత్ సిద్ధం.. కానీ కెనడా సమాచారం ఇవ్వడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని గతేడాది గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలోని సర్రేలో కాల్చిచంపారు. ఈ కేసులో నలుగురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన నాలుగో అరెస్ట్‌పై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. కెనడా నుంచి అసలు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. విచారణకు సంబంధించిన ఏదైనా సాక్ష్యాలు, సమాచారం ఉంటే తమతో పంచుకుంటే దర్యాప్తుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
‘‘ మా పరిశోధనా ఏజెన్సీలు విచారణ జరిపేందుకు నిర్ధిష్టమైన, విలువైనవి మేము ఎప్పుడూ అందుకోలేదు. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా ఏమీ మారినట్లు నాకు తెలియదు’’ అని జైశంకర్ చెప్పారు. విదేశీయుల అరెస్ట్ జరిగినప్పుడు సాధారణంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు తెలియజేస్తారని జైశంకర్ జోడించారు. గతేడాది జూన్ 18న సర్రేలోని గురుద్వారా వెలుపల చంపబడ్డాడు. అయితే, నిజ్జర్‌ని భారత్ ఖలిస్తానీ ఉగ్రవాదిగా గుర్తించింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) పేరుతో భారత వ్యతిరేకతను ప్రోత్సహించాడు.
నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రేరేపిత, అసంబద్ధ వ్యాఖ్యలుగా వర్ణించింది. దీంతో పాటు కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దిగజారాయి.
తాజావార్తలు
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?