China: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి మళ్లీ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, 2014, 2019 మాదిరిగా కాకుండా ఈ సారి బీజేపీ మెజారిటీ మార్కుకు దాదాపుగా 30 సీట్ల దూరంలో ఆగిపోయింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ కింగ్డమ్ నుండి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువస్తుంది. RBI యొక్క ఆర్థిక విధానంలో ఇది ఒక పెద్ద మార్పు, ఎందుకంటే ఇది ఇప్పుడు దాని స్వంత ఖజానాలో ఎక్కువ బంగారాన్ని కలిగి ఉంటుంది. వన్నె తగ్గని అపురూప ఖనిజం బంగారం. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే చాల ఇష్టం. బంగారం అనేది కేవలం వ్యక్తులకే కాదు, దేశాలకు కూడా ఎంతో కీలకం. బంగారం నిల్వలు ఎంత ఉంటే…
ఖలిస్తాన్ సమస్యపై గతేడాది నుంచి భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక, కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో ఈ సంబంధాలలో మరింత ఉద్రిక్తతను సృష్టించాయి.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన కాంగ్రెస్.. అనేక చోట్ల అధికార పార్టీ భాజపాకు గట్టిపోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇదే. దీనితో రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు? ఈ నేపథ్యంలో…
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. టీమిండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 96 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండా.. కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 3 వికెట్లతో చెలరేగాడు. ఇక.. ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే, గారెత్ డెలానీ…
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. ఇక.. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు వాతావరణం మరియు పిచ్ రెండూ సహాయపడతాయి.
2024 ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కాగా.. ఈ ఎన్నికల్లో కొందరు ముఖ్యమైన ఓటమిపాలైతే.. మరికొందరు తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. కాగా.. నిన్న గెలిచిన వారిలో కాంగ్రెస్ ఎంపీగా సంజనా జాతవ్ కూడా ఉన్నారు. ఈమె ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ.. రాజస్థాన్‌లోని భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించింది. సంజనా జాతవ్ వయస్సు…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.
భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా గతంలో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజైన మంగళవారం స్టాక్ మార్కెట్లో భారీ భూకంపం సంభవించింది. అదే సమయంలో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ సెన్సెక్స్ 6000 పాయింట్లకు పైగా పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 1900 పాయింట్ల వరకు పడిపోయింది.