ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ‘నమస్తే’ అంటూ పలకరించుకున్నారు. జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందింది.
భారత సైన్యం దగ్గర ఇప్పుడు బలమైన ఆయుధం ఉంది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ మొదటి స్వదేశీ లాటరింగ్ మందుగుండు 'నాగాస్త్ర-1'ని భారత సైన్యానికి అందజేసింది. ఇది ఇంట్లోకి ప్రవేశించి శత్రువులపై దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారు. ఈ డ్రోన్ శత్రు భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం కలిగిస్తుంది.
Shubman Gill and Avesh Khan Out Form T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్ 8కు దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్‌లో కెనడాతో శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. టేబుల్ టాపర్‌గా టీమిండియా లీగ్ దశను ముగిస్తుంది. ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్ అనంతరం కరేబియన్ దీవులకు రోహిత్ సేన పయనమవుతుంది. సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అక్కడే ఆడాల్సి ఉంది. ఈ…
కువైట్ లోని దక్షిణ నగరమైన మంగాఫ్ లోని 196 మంది వలస కార్మికులు నివసిస్తున్న 7 అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 45 మంది భారతీయులు మరణించారు. కాగా.. 45 మంది భారతీయుల మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత.. అగ్ని ప్రమాదంలో గాయపడిన భారతీయులకు సహాయం చేయడానికి, మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి…
దేశ సముద్ర సరిహద్దులను కాపాడే ఇండియన్ కోస్ట్ గార్డ్..సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.10వ తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్సైట్ joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్స ఉంటుంది.
ప్రధాని మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా కొనసాగనున్నారు. డాక్టర్ పీకే మిశ్రా నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పికె మిశ్రా పూర్తి పేరు ప్రమోద్ కుమార్ మిశ్రా.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్‌తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అవిభాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది.
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000…
ఎలక్షన్ కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు)పై భారత ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. అయితే.. అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ ఎన్నికల ప్రక్రియను కొనియాడుతూనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం వైట్ హౌజ్ కి చెందిన ఓ నాయకుడు ఇండియా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తించేసిందని.. ఈసీకి అభినందనలు తెలిపారు.