Fake social media profiles: డ్రాగన్ కంట్రీ చైనా తన భారత వ్యతిరేకతను వీడటం లేదు. ఏదో విధంగా భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా సిక్కులను టార్గెట్ చేస్తూ, భారత వ్యతిరేక ప్రచారం కోసం ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్రియేట్ చేస్తోంది.
China: జిత్తులమారి డ్రాగన్ కంట్రీ చైనా భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.
ఢిల్లీ అగ్నిగుండంగా మారింది. ఎన్నడూ లేనంత రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఈరోజు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా ఢిల్లీలో పలు చోట్ల వర్షం కురుస్తుంది.
Pakistan: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో హయాంలో కుదుర్చుకున్న ‘‘లాహోర్ ఒప్పందాన్ని’’ పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుతం అధికార పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) నేత నవాజ్ షరీఫ్ మంగళవారం అంగీకరించారు.
ఆల్కహాల్ నోటి, గొంతు, కడుపు, ప్రేగుల ద్వారా రక్తంలో కలిసిపోతుంది. ఎందుకంటే మద్యం తాగిన తర్వాత జీర్ణం కాదు. ఊపిరితిత్తుల ద్వారా రక్తం వెళ్ళిన వెంటనే, ఆల్కహాల్ కూడా శ్వాస ద్వారా గాలిలోకి రావడం ప్రారంభమవుతుంది.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. సూర్యుడు సుర్రుమంటున్నాడు.
ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలో వేడిగాలులుల తీవ్రంగా వీస్తున్నాయి. మరికొద్ది రోజుల పాటు ఢిల్లీలో వేడిగాలులు విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అజిత్ దోవల్ పేరును అందరికీ సుపరిచితమే. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అనుభవజ్ఞులు, నాయకులు కూడా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా అతడిని ప్రశంసించడం ప్రారంభించారు. తాజాగా ఓ కార్యక్రమంలో అజిత్ దోవల్ ఇజ్రాయెల్ పై ప్రశంసలు కురిపించారు.
Anwarul Azim : బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్‌లో గొంతు కోసి దారుణంగా చంపబడ్డాడు.
సింగపూర్‌లో విధ్వంసం సృష్టించిన కోవిడ్ KP.2 , KP.1 కొత్త వేరియంట్లు.. ఇప్పుడు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఇండియాలో 290 KP.2 కేసులు, 34 KP.1 కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇవి JN1 సబ్ వేరియంట్లు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. కోవిడ్ కొత్త వేరియంట్లతో ఎలాంటి ప్రమాదం లేదని నివేదిక పేర్కొంది.