సార్వత్రిక ఎన్నికల కారణంగా బ్రిటన్‌లో తీవ్ర రాజకీయ గందరగోళం నెలకొంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి వారంలో బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్, అతని భార్య అక్షతా మూర్తి లండన్‌లోని ఐకానిక్ BAPS స్వామినారాయణ ఆలయంలో ప్రార్థనలు చేశారు. దీనిని నీస్డెన్ ఆలయంగా పిలుస్తారు. అతను పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. ఆలయ సముదాయాన్ని సందర్శించి, అనంతరం వాలంటీర్లు, కమ్యూనిటీ నాయకులతో సంభాషించారు. క్రికెట్ అభిమాని అయిన సునక్ భారతదేశం టీ20 ప్రపంచ కప్ విజయాన్ని ప్రస్తావించారు. ప్రపంచకప్‌ను భారత్ అద్భుతంగా ఆడి గెలిచిందన్నారు. భారత్ టీంకి అభినందనలు తెలిపారు.
READ MORE: Rohit Sharma Robo Walk: రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్న రోహిత్ శర్మ!
నా మతం నుంచి ప్రేరణ.. ఓదార్పు
సునక్ తన మతం గురించి మాట్లాడుతూ.. “నేను హిందువుని.. మీ అందరిలాగే నేను కూడా నా హిందు మతం నుంచే ప్రేరణ సాంత్వన పొందుతాను. భగవద్గీతతో పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేసినందుకు నేను గర్వపడుతున్నాను. మన ధర్మం మన విధిని నిర్వర్తించాలని బోధిస్తుంది. మనం నిజాయితీగా చేస్తే దాని పర్యవసానాల గురించి చింతించకండి. ఇది నా ప్రేమగల తల్లిదండ్రులు నాకు నేర్పించారు. నేను నా జీవితాన్ని ఇలా గడుపుతున్నాను. నా కుమార్తెలు పెద్దయ్యాక ఇదే నేను వారికి అందించాలనుకుంటున్నాను. ప్రజాసేవ పట్ల నా దృక్పథంలో నాకు మార్గనిర్దేశం చేసేది మతం.” అని వ్యాఖ్యానించారు.