టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈరోజు ఇండియా-అమెరికా జట్ల మధ్య మ్యా్చ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. టీమిండియా సూపర్-8లోకి ఎంటర్ కానుంది.
జూలై 4న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడున్న బ్రిటన్ హిందువులు భవిష్యత్తు ప్రభుత్వం కోసం తమ డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి.
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి.
దేశ ప్రజలను ఉద్దేశించి సినీనటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు.. అధికంగా పని చేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలని తెలిపారు.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పాలస్తీనాలో అధ్వాన్నమైన పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు మంగళవారం (జూన్ 11) 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనా 6.6%గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం.. వస్తు తయారీ, రియల్ ఎస్టేట్‌లో మరింత వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.6…
బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ముంబై నుంచి షాకింగ్ విషయం బహిర్గతమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలుగురు యువకులు ఇక్కడ నివసించడమే కాకుండా.. వారు చట్టవిరుద్ధంగా భారత పౌరులుగా మారడానికి పత్రాలను కూడా పొందారు.
అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన ఎడ్జ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి రెండు గ్రూపులు సంయుక్తంగా క్షిపణులు, ఆయుధాలను అభివృద్ధి చేస్తాయనున్నాయి.
Team India T20 World Cup Record: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది 7వ విజయం. దాంతో భారత్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. పొట్టి టోర్నీలో…