ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8కు చేరిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయం అందుకున్న రోహిత్ సేన నేడు కెనడాతో మ్యాచ్ ఆడనుంది. అయితే భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలు అవ్వాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిక్కడగా మారడంతో ఆలస్యం అవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఏడున్నర గంటలకు టాస్ వేయాల్సిన అంపైర్లు దానిని కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అంపైర్లు…
పబ్జీ గేమ్‌లో పరిచయం.. దేశాలు దాటేలా చేసింది. గతంలో పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ ఇదే పబ్జీలో ఇండియాకు చెందిన సచిన్‌తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో.. తన భర్తను వదిలేసి పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఈ ఘటన అప్పుడు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా.. పబ్జీ గేమ్‌లో యూపీ ఇటావాకు చెందిన ఓ యువకుడితో అమెరికా అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలిక యువకుడిని కలవడానికి ఇటావా వచ్చింది.
ప్రపంచ పొట్టి ప్రపంచకప్‌లో హోస్ట్ టీమ్ అమెరికా చరిత్రను సృష్టిస్తుంది. సొంతగడ్డపై ఎన్నో విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన యూఎస్ఏ టీమ్ సూపర్ 8కి చేరి రికార్డు సృష్టించింది. ఫ్లోరిడాలో వర్షం కారణంగా ఐర్లాండ్‌తో తమ ఆట రద్దు కావడంతో మోనాక్ పటేల్ జట్టు రెండో రౌండ్ కు చేరుకుంది. దీనితోపాటు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, అమెరికా 2026 టీ 20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే…
రాంచీలోని మహమ్మద్ అలీ హుస్సేన్ కువైట్‌లోని భవనం అగ్నిప్రమాదంలో మరణించారనే వార్త తెలిసిన తర్వాత అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల అలీ.. తన తల్లి కువైట్ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ, మెరుగైన జీవితం కోసం 18 రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అయితే.. గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అలీ మృతి చెందాడు.
దేశంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛమైన నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత వెనుక వాతావరణ మార్పు ఒక ప్రధాన కారణం అయితే, మితిమీరిన వినియోగం, వృథా కూడా నీటి సంక్షోభ ప్రమాదాన్ని పెంచింది.