Viral Video: భారత జట్టును దగ్గరగా చూడ్డానికి.. ఏకంగా చెట్టెక్కిన అభిమాని!
- భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు
- మెరైన్ రోడ్డు దద్దరిల్లిపోయింది
- ఆటగాళ్లను చూడాలని అభిమాని రిస్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Fan Climb A Tree For Looking Indian Cricket Team Victory Parade: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియా క్రికెటర్లకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్.. పొట్టి ప్రపంచకప్‌ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో జనాలతో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. ముంబైలోని మెరైన్ రోడ్డు అయితే కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్‌షో.. భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన భారత జట్టును చూడటానికి, అభినందించడానికి అభిమానులు దేశం నలుమూల నుంచి గురువారం ముంబైకి చేరుకున్నారు. అయితే భారత ఆటగాళ్లను దగ్గరగా చూడాలని ఓ అభిమాని పెద్ద రిస్క్ చేశాడు. మెరైన్ రోడ్డులో రోడ్‌షో జరుగుతుండగా.. ఓ అభిమాని రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ చెట్టు పైకెక్కి ఆటగాళ్లను పలకరించే ప్రయత్నించాడు. చెట్టు కొమ్మపై పడుకుని.. ఓ చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ, మరో చేతితో టీమిండియాను వీడియో తీశాడు. సదరు అభిమాని ఆటగాళ్లను చూసి సంతోషపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
Also Read: BRS MLCs In Congress: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..
ఆ అభిమాని రిస్క్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘లక్కీ ఫెల్లో.. టీ20 ప్రపంచకప్‌ను దగ్గరనుండి చూశాడు’, ‘నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో’, ‘ఎవడ్రా వీడు.. ఇంత టాలెండెడ్‌గా ఉన్నాడు’ అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. జూన్ 29న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
टीम इंडिया को करीब से देखने के लिए पेड़ पर चढ़ गया शख़्स, देखिए वीडियो#Shankhnaad #T20WorldCup #IndianCricketTeam #VictoryParade | @chitraaum pic.twitter.com/9zENHdKjV9
— AajTak (@aajtak) July 4, 2024
తాజావార్తలు
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!