India vs Zimbabwe : భారత్, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు యువ జట్టు సిద్ధమైంది. టీ20 సిరీస్ నేడు జులై 6 ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో యువ భారత్ 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీమిండియాకు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. గిల్‌తో పాటు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రింకూ సింగ్, జితేష్ శర్మ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అందరి దృష్టి జింబాబ్వేపై వారి ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా రెగ్యులర్ టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సిరీస్‌లో గిల్ కెప్టెన్ గా మంచి మార్కులు పడితే సెలక్టర్లు అతడిని కెప్టెన్ గా పరిగణించే అవకాశం లేకపోలేదు. కొత్త ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కి కూడా ఇదే మంచి అవకాశం. ఈ సిరీస్‌లో బ్యాటింగ్ తో రాణిస్తే టీ20 అంతర్జాతీయ సిరీస్‌కు ఎంపిక చేయడంలో ముందంజలో ఉంటాడు. దీనికి కారణం ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆడిన గైక్వాడ్‌లో నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. దాంతో ఈ అవకాశాన్ని ఈ గైక్వాడ్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూద్దాం.
Daily Yoga : యోగా చేయడం అవసరమేనా..? ఒకవేళ రోజూ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ప్రపంచకప్‌లో తుది జట్టులోకి రాలేకపోయిన రింకూ సింగ్ కూడా ఈ సిరీస్‌లో తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. వికెట్ కీపర్‌గా జితేష్ శర్మ రాణించాలని భావిస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతను పంచుకోగా, అబేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ లు పేస్ విభాగానికి నాయకత్వం వహించనున్నారు. గత ఐపీఎల్‌లో రాణించిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ భారత జట్టులో అరంగేట్రం చేయనున్నారు. ఈ సిరీస్ వారికి ప్రత్యేకం కానుంది. కెప్టెన్ గిల్ కచ్చితంగా ఇన్నింగ్స్‌ని ఓపనర్ గా ఆడనుండగా., అయ్యన్నకు తోడుగా అభిషేక్ అయ్యర్ ఓపెనింగ్ చేయవచ్చు. ఇక ఆపై రుతురాజ్ గైక్వాడ్, రియాన్, రింకూ సింగ్ లు ఉండనే ఉన్నారు.
Bharateeyudu 2: భాగ్యనగరంలో ‘భారతీయుడు 2’ సందడి.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక నేటి నుంచి మొదలయ్యే అన్ని మ్యాచ్‌లు హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతాయి. అన్ని మ్యాచ్‌లు భారత దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇకపోతే ఆతిథ్య దేశం జింబాబ్వే కూడా కాస్త బలంగానే ఉంది. సికిందర్ రజా నాయకత్వంలో భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలని జింబాబ్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటిలాగే, కెప్టెన్ రెజా ఆల్ రౌండర్‌గా కమాండ్ తీసుకుంటాడు. ఇక ముజారబానీ, నగలవా, మద్వీరా, జాన్వీ, మసకజాలతో కూడిన బలమైన ప్రత్యర్థి జట్టు యువ భారత్‌కు సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్‌లోని మ్యాచ్ లను మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో Sony Liv యాప్ లో ప్రత్యక్ష ప్రసారం కాబోతున్నాయి. కాకపోతే, ఇది ఉచితం కాదు. దీనికి సబ్స్క్రిప్షన్ అవసరం. లేకపోతే టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్ లో సిరీస్ లైవ్ ప్రసారం కానుంది.