పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో ఈవెంట్లో యోగేష్ కథునియా రజత పతకం గెలుచుకున్నాడు. 42.22 మీటర్లతో యోగేష్ కథునియా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. భారత్ మరో పతకం సాధించింది. కాగా.. పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా ఎనిమిది పతకాలు సాధించింది.
Jaishankar on china: చైనాపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు.
స్మైల్ పే అనే పేరుతో కొత్త తరహా పేమెంట్ విధానానికి ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టింది. దీంతో వినియోగదారుల ఫేస్ రికగ్నైజేషన్‌తో ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అంటే స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్‌తో పనుండదు. కేవలం రెండు దశల్లోనే ఈ చెల్లింపులు పూర్తి చేయొచ్చు. యూఐడీఏఐకి చెందిన భీమ్ ఆధార్ పేతో రూపొందించిన అధునాతన ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీనే ఈ స్మైల్ పే..బ్యాంక్ మర్చంట్స్ తమ మొబైల్లో ఫెడ్ మర్చెంట్ అప్లికేషన్‌లోని పేమెంట్ ఆప్షన్లలో ఉండే స్మైల్ పే ఆప్షన్‌ను…
Piyush Goyal: భారతదేశ కంపెనీలు ఒకదాని వస్తువులు మరొకటి కొనుగోలు చేస్తూ సపోర్టుగా నిలవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. దీని వల్ల కరోనా మహమ్మారి లాంటి అవాంతరాలను ఎదుర్కోవచ్చు అన్నారు.
PM Modi On Global Fintech: ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కార్ అనేక విధానపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో ఒకటి ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేయడం వల్ల.. గత పదేళ్లలో ఈ రంగం 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు.
Cognizant: టెక్ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తన ప్రధాన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టింది. చెన్నైలోని ఒక్కియం తొరాయ్‌పక్కంలోని ఈ బిల్డింగ్ ను దాదాపు 20 ఏళ్లుగా ఆ సంస్థ హెడ్ ఆఫీస్‌గా ఉపయోగిస్తుంది. ఐటీ కారిడార్‌లోని దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లక్షల చదరపు అడుగుల ఈ కార్యాలయం విలువ కనీసం 750 - 800 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని రియల్ ఎస్టేట్ సంస్థల అంచనా వేస్తున్నాయి.