పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకధారులు ఇద్దరు అథ్లెట్లు పాల్గొననున్నారు. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ స్ప్రింటర్ ప్రీతి పాల్, స్వర్ణ పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్ పారిస్ క్రీడల ముగింపు వేడుకలో పాల్గొననున్నారు.
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్‌కి దగ్గర అవుతోంది. ఏ దేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని పోరాడింతో, ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా షేక్ హసీనాను గద్దె దించడంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత, ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ఐటీ మంత్రిగా ఉన్న నహిద్ ఇస్లాం పాకిస్తాన్ రాయబార అధికారులతో భేటీ అవుతున్నాడు.
Bangladesh: రిజర్వేషన్ కోటాని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఉన్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత లౌకిక దేశంగా ఉన్న బంగ్లా నెమ్మదిగా ఇస్లామిక్ రాడికల్ పాలన దిశగా వెళ్తోంది. ఇందుకు అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఈ ఆరోపణల్ని బలపరుస్తున్నాయి.
పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ T64 ఫైనల్లో భారత పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి స్వర్ణ పతకాన్ని అందించాడు. పతక రౌండ్లో ప్రవీణ్ 2.08 మీటర్లు ఎగసి రికార్డు బద్దలు కొట్టాడు.
పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల -60 కేజీల J1 విభాగంలో జూడోకా కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. బ్రెజిల్‌కు చెందిన ఎలియెల్టన్ డి ఒలివెరాను ఇప్పన్ను కపిల్ పర్మా్ర్ ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా.. తాజా పతకంతో పతకాల సంఖ్య 25కి చేరింది. అందులో.. ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.