Warship vs warship: హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు చైనా ట్రై చేస్తుంది. డ్రాగన్ కంట్రీ యొక్క దుర్మార్గపు ప్రణాళికలను విఫలం చేయడానికి భారతదేశం కూడా విభిన్న వ్యూహాలను రచిస్తోంది.
PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. ఇటీవల, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, బంగ్లాదేశ్లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాలపై మోడీతో జో బైడెన్ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన నాగమణి అనే మహిళ కువైట్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తనను యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని.. వెంటనే ఇండియాకి తీసుకురావాలని సెల్ఫీ వీడియో ద్వారా ఆ మహిళ తెలియజేసింది. తన ఆరోగ్యం క్షీణించిందని.. నోటి నుండి రక్తం పడుతున్న పట్టించుకోవడంలేదని తీవ్రంగా ఏడుస్తుంది. అయితే.. తనను మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని కాపాడాలని నాగమణి కోరుతుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ తర్వాత భారత ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించబోతోంది. దోపిడీ, జూదం మొదలైన నేర కార్యకలాపాలలో ఈ యాప్ ఉపయోగించబడుతుందో లేదో ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది.
PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం.
భారత్లోకి బంగ్లాదేశీయులు ప్రవేశంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో అస్థిరత నెలకొన్నప్పటికీ అక్కడి హిందువులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులు నివసిస్తున్నారు.. వారు పోరాడుతున్నారు. గత నెల రోజులుగా ఒక్క హిందువు కూడా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించలేదని అన్నారు.