ICC WTC Points Table: డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతాలు చేసిందనే చెప్పాలి. ఏకంగా రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దెబ్బతో దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పాటు భారతదేశానికి డేంజర్ అలెర్ట్ ని పెంచింది.
Also Read: Hyderabad Road Accident: లంగర్‌హౌస్‌లో ఇద్దరు.. చర్లపల్లిలో ఒక చిన్నారి మృతి
ఇక ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ దక్షిణాఫ్రికా 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటములతో 64 పాయింట్లతో సమీకరణాన్ని మార్చింది. 59.26 పర్సంటేజ్ తో జట్టు రెండవ స్థానంలో ఉంది. 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 ఓటములతో 90 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 57.69 పర్సంటేజ్ తో మూడవ స్థానంలో ఉంది. 15 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 ఓటములతో 110 పాయింట్లతో 61.11 పర్సంటేజ్తో భారత జట్టు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, పాకిస్తాన్ వరుస స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Also Read: Naresh Balyan: దోపిడీ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
The Proteas wrap up a handsome win in Durban to take 1️⃣-0️⃣ lead in the two-Test series 🏏
📝 #SAvSL: https://t.co/dVkUTYXu2p #WTC25 pic.twitter.com/VkUfBjYtOY
— ICC (@ICC) November 30, 2024
పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన ఇరు జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరుతాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి, ఇంకా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్స్‌కు చేరుకోవడానికి మెరుగైన అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 5 నుంచి జరగనుంది. సెయింట్ జార్జ్ పార్క్‌లో మ్యాచ్ జరగనుంది. వచ్చే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసేందుకు శ్రీలంక జట్టు ప్రయత్నిస్తుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే మొదటి స్థానానికి కూడా వెళ్లవచ్చు.