భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మూడో మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్‌కు ఇంకో ఒక వికెట్ మాత్రమే మిగిలుంది. ఈ క్రమంలో.. ముంబై వాంఖడే స్టేడియంలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో స్పిన్ బౌలర్లదే ఆధిపత్యం నడుస్తోంది. ముంబైలో కూడా అలాంటిదే జరిగింది.. ఇరు జట్ల స్పిన్నర్లు భారీగానే వికెట్లు పడగొట్టారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక రోజు ముందు.. కొత్త దేశం పాకిస్థాన్ పుట్టింది. అప్పటి నుంచి పొరుగు దేశంతో మన సంబంధాలు సరిగా లేవు. ఇరు దేశాల మధ్య పలు మార్లు యుద్ధాలు కూడా జరిగాయి. అయితే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఎప్పుడూ చెక్కుచెదరకుండా కొనసాగాయి. కానీ.. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అందులో పాకిస్థాన్ నుంచి వచ్చే కొన్ని రోజువారీ వస్తువులు కూడా ఉన్నాయి. అందులో రాక్ ఉప్పు…
అక్టోబర్ నెలలో వేడిని అనుభవించారా..? 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. గతంలో 1951 అక్టోబర్‌లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు కాగా.. తాజాగా 120 ఏళ్ల తర్వాత మళ్లీ చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో మధ్య భారతదేశంలోని (మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్)లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. అంతేకాకుండా.. ఢిల్లీ NCR సహా ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కూడా అక్టోబర్ నెలలో ఎక్కువ వేడి నమోదైంది.
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును…
రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతిస్తున్నారనే ఆరోపణలతో 15 భారతీయ కంపెనీలతో సహా 275 మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీకి చెందిన కంపెనీలను కూడా రష్యాకు అత్యాధునిక సాంకేతికత, పరికరాలను సరఫరా చేసినందుకు నిషేధించామని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా తన యుద్ధ యంత్రాంగానికి ఈ కంపెనీలు మద్దతు తెలిపాయని ఆరోపించింది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను ఇప్పటికే భారత్ కోల్పోయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్ వైట్‌వాష్ కాకుండా చూసుకోవాల్సిన దానిపై టీమిండియాపై ఉంది.
కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు
First Analog Space Mission: ఇస్రో (ISRO) తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను గురువారం నాడు లేహ్‌లో ప్రారంభించింది. ఇందుకు సంబంధించి.. శుక్రవారం నాడు ఆ మిషన్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకోవడం ద్వారా ఇస్రో ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఒక మైలురాయిగా నిరూపించబడుతుంది. భవిష్యత్తులో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి, అలాగే భూమి బయట విశ్వంలో జీవం కోసం అన్వేషించడం ఈ మిషన్ ముఖ్య లక్ష్యం. మానవ…