దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు.
భారత్ దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ శుక్రవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. జనవరి 1, 2025 నుంచి పోర్ట్‌ఫోలియోలోని మొత్తం మోడల్ శ్రేణిపై భారతదేశంలో తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు శుక్రవారం తెలిపింది.
యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. "క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది." అని ఆయన స్పష్టం చేశారు. 1986లో…
రోజంతా అంటే 11 గంటలు దాదాపు నాలుగు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం ఈజీ అవుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఈ క్రమంలో 11 గంటలు బ్యాటింగ్ చేసే బ్యాటర్ విషయంలో గంభీర్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు. టాప్ -7లోని బ్యాటర్లంతా ఆడగలరు అని చెప్పుకొచ్చాడు.
హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేదే లేదని తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెల్లడించలేదు.
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గురువారం బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది.
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో భాగంగా.. నవంబర్ 13న సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత్.. ఆస్ట్రేలియాను సమం చేసింది. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు 17-17 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించాయి.