Nissan Magnite SUV: ఇండియాలో భారీగా అమ్ముడవుతున్న నిస్సాన్ మాగ్నైట్.. లక్షల్లో యూనిట్లు సేల్
- భారత్ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ
- సేల్స్‌లో నిస్సాన్ సరికొత్త రికార్డు
- భారత్‌లో మొత్తం ఐదు లక్షల యూనిట్లు అమ్మకం
- ఇండియాలో కాంపాక్ట్ SUV విభాగంలో నిస్సాన్ మాగ్నైట్ SUV.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీని జపనీస్ ఆటోమేకర్ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. సేల్స్ పరంగా నిస్సాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే.. కంపెనీ ఎలాంటి రికార్డు సృష్టించింది..? గత నెలలో ఎన్ని యూనిట్లు విక్రయించబడ్డాయి? ఎన్ని యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి? ఈ విషయాలు తెలుసుకుందాం.. నిస్సాన్ మాగ్నైట్ SUV ఇండియాలో కాంపాక్ట్ SUV విభాగంలో అందిస్తోంది. నిస్సాన్ కంపెనీ ఈ కారును తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో అందిస్తుంది. ఈ క్రమంలో.. నిస్సాన్ విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ సమాచారం ప్రకారం.. భారత్‌లో మొత్తం ఐదు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
MG Cyberster EV: 580 కి.మీ రేంజ్.. సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న స్పోర్ట్స్ కార్
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
నవంబర్ 2024లో పనితీరు:
2024 నవంబర్‌లో నిస్సాన్ 9040 యూనిట్ల కార్లను విక్రయించింది. వీటిలో 2342 యూనిట్లు భారత మార్కెట్లో సేల్ అయ్యాయి. 6698 యూనిట్లు ఎగుమతి చేశారు. నవంబర్ నెలలో 62 శాతం విక్రయాలు పెరిగాయి. 2024 అక్టోబర్‌లో నిస్సాన్ 5570 యూనిట్లు విక్రయించగా, నవంబర్‌లో ఈ సంఖ్య 9040 యూనిట్లకు పెరిగింది.
డిమాండ్ పెరిగింది:
మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీకి దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీ నుండి అందిన సమాచారం ప్రకారం.. నెలవారీ ప్రాతిపదికన ఎగుమతుల్లో 173.5 శాతం పెరుగుదల, సంవత్సర ప్రాతిపదికన 222 శాతం పెరుగుదల ఉంది. 2023 నవంబర్‌లో కంపెనీ 2081 యూనిట్లను ఎగుమతి చేసింది. 2024 అక్టోబర్‌లో ఈ సంఖ్య 2449 యూనిట్లుగా ఉంది. 2024 నవంబర్‌లో కంపెనీ 6698 యూనిట్లను ఎగుమతి చేసింది.
త్వరలో కొత్త ఎస్‌యూవీ:
నిస్సాన్ ఇటీవలే మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది కాంపాక్ట్ SUV విభాగంలో అందించనున్నారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. అయితే.. నిస్సాన్ రాబోయే కొద్ది నెలల్లో కొత్త SUVని విడుదల చేయనున్నట్లు సమాచారం. 2025 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పో సందర్భంగా నిస్సాన్ తన కొత్త SUVని విడుదల చేస్తుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!