2026 మార్చి 31 నాటికి భారతదేశం నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. 'అజెండా ఆజ్ తక్' కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. నక్సలిజం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్ల తరబడి అభివృద్ధిని అడ్డుకున్నదని అన్నారు.
Kiren Rijiju: లోక్‌సభలో భారత రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025 లో భాగంగా.. ఈరోజు మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ కొద్దిసేపటికే నిలిచిపోయింది. తొలిరోజు 13.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అనంతరం.. వరుణుడు మళ్లీ అడ్డుపడ్డాడు.
లోక్‌సభలో మాట్లాడిని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ బంగ్లాలోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వీటిని నివారించడానికి ఆ దేశ తాత్కాలిక సర్కార్ మైనారిటీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వ విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు.. రాజకీయ, సినీ ప్రముఖులు గుకేశ్ విజయాన్ని కొనియాడుతున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిలు ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. గుకేశ్‌కు విలక్షణ నటుడు కమల్ హాసన్ శుభాకాంక్షలు చెప్పారు. ‘చరిత్రకు చెక్‌మేట్ పడింది. చదరంగంలో కొత్త అధ్యయనాన్ని లిఖించిన డి గుకేశ్‌కు అభినందనలు.…
ఇప్పుడే తన కెరీర్ మొదలైందని, ఇంకా చాలా ఉందని ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తెలిపారు. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినంత మాత్రాన తానే అత్యుత్తమం కాదని, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ స్థాయికి చేరుకోవాలని ఉందని చెప్పాడు. గత పదేళ్లుగా ఈ క్షణం కోసం కల కన్నా అని, ఆరేడేళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా సాగుతున్నా అని పేర్కొన్నాడు. తన జీవితంలో అత్యుత్తమ సందర్భం ఇదే అని గుకేశ్ చెప్పుకొచ్చాడు. గురువారం జరిగిన చివరి…
Syrian Rebel Flag: అరబ్ రిపబ్లిక్లో బషర్ అల్-అస్సాద్ పాలనను తిరుగుబాటు దళాలు కూల్చివేశాయి. దీంతో తాజాగా, న్యూఢిల్లీలోని సిరియన్ ఎంబసీలో రెబల్స్ యొక్క కొత్త జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు. గురువారం జరిగిన చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచాడు. దాంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) రికార్డు సాధించాడు. అంతకుముందు గారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయస్సులో ఛాంపియన్‌గా నిలిచాడు. Also Read: Virat Kohli:…