Supreme Court: రేపు మధురాలో కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై సుప్రీం విచారణ..
- మథురాలో గల శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదం..
- మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను రేపు విచారించనున్న సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో గల శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదంలో మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు (జనవరి 15న) విచారించనుంది. ఈ వివాదంపై దాఖలైన 15 కేసులను విచారణకు స్వీకరించొద్దని మసీదు కమిటీ వేసిన పిల్ ను అలహాబాద్ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం గత ఆగస్టు 1న తిరస్కరించడంతో కమిటీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. మథురాలోని కృష్ణాలయాన్ని ఔరంగజేబ్ హయాంలో కూలగొట్టి అక్కడ మసీదు కట్టారని హిందూ సంస్థలు వాదనలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు గొడవ చెలరేగడంతో 1991లో పార్లమెంట్ ప్రార్థన స్థలాల చట్టం తీసుకొచ్చింది. మన స్వాతంత్య్ర దినమైన 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ప్రార్థన స్థలాలకున్న మత స్వభావాన్ని మార్చొద్దని ఆ చట్టంలో పేర్కొన్నారు.
Read Also: Mahakumbh First Amrit Snan: ప్రయాగ్‌రాజ్‌లో నేడు మొదటి ‘అమృత స్నాన్’.. ఘాట్స్ వద్ద లక్షలాది భక్తులు!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇక, అయోధ్య రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి ప్రత్యేక ప్రార్థన స్థలాల చట్టం నుంచి 1991లో కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కృష్ణ జన్మభూమి సమీపంలోని మసీదుపై హిందూ సంస్థలు వేసిన పిటిసన్ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మసీదు కమిటీ హైకోర్టులో తెలిపింది. దానికి హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి 1991నాటి చట్టం మత స్వభావమంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేదుని, వివాదాస్పద స్థలంలో మసీదు, ఆలయం పక్కపక్కనే ఉండటం వల్ల ఆ స్థలం మత స్వభావాన్ని నిర్దారించలేమని ఏకసభ్య ధర్మాసనం తీర్మానించింది. అక్కడి కట్టడం మసీదు లేదా ఆలయం అయి ఉండాలి.. కానీ, ఏకకాలంలో రెండూ కాలేదన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!