Womens T20 World Cup 2024: ఈ ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లపై సిరీస్ ఓటములను చవిచూసింది, కానీ బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. జూలైలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా అయింది. దీని తర్వాత, 2024 ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్లో అజేయంగా నిలిచిన భారత జట్టు శ్రీలంక చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024…
IND vs PAK Hockey Match Live Streaming Info: 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత పురుషుల జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. చైనాపై 3-0, జపాన్‌పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై 3-1 తేడాతో నెగ్గిన భారత్.. ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. నేడు కీలక సమరానికి సిద్దమైంది. చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్…
India won’t travel to Pakistan for Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందజేసింది. అయితే ఈ షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడదని…
జమ్మూ కాశ్మీర్లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు తలదాచుకుంటూ అక్కడి నుంచి వారు తమ స్థానిక నెట్‌వర్క్‌ల ద్వారా బారాముల్లా, కుప్వారాతో సహా లోయలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
Team India T20 World Cup Record: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా రికార్డు నెలకొల్పింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది 7వ విజయం. దాంతో భారత్ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. పొట్టి టోర్నీలో…
Jasprit Bumrah on Trolls When He Wad Injured: ఒక్క సంవత్సరం వ్యవధిలోనే తన పట్ల కొందరికి అభిప్రాయం మారిపోయిందని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తన కెరీర్ ముగిసిందన్న వారే.. ఇప్పుడు బుమ్రా సూపర్ అని అంటున్నారన్నాడు. ఎప్పుడైనా తన ముందున్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా అని బుమ్రా చెప్పుకొచ్చాడు. 2022లో వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. సొంతగడ్డపై పునరాగమనానికి ముందు గాయం తిరగబెట్టడంతో..…
Ravi Shastri Gives Best Fielder Award To Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ప్రపంచకప్ 2024లో చూడటం చాలా బాగుందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆనందం వ్యక్తం చేశాడు. పంత్ రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయని, అతడిని ఆసుపత్రిలో చూస్తానని తాను అనుకోలేదన్నాడు. గాయాల నుంచి కోలుకుని వచ్చి.. మెగా టోర్నీ మ్యాచ్‌ల్లో సత్తా చాటడం అద్భుతం అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం…
Sunil Gavaskar Fires on Team India Batters: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. పసికూన ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై మాత్రం తృటిలో ఓటమి నుంచి బయటపడింది. బౌలర్లకు సహకరించే న్యూయార్క్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పాక్ 113/7 స్కోరుకే పరిమితమైంది. భారత్ విజయం సాధించినప్పటికీ.. బ్యాటర్ల బ్యాటింగ్ తీరు అందరినీ నిరాశపర్చింది.…
Saleem Malik on Pakistan Defeat against India: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ మరో ఓటమిని చవిచూసింది. పసికూన అమెరికాపై ఓడిన పాక్.. తాజాగా టీమిండియా చేతుల్లోనూ పరాభవం ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాక్ (113/7) విఫలమైంది. తమ జట్టు ఓటమికి భారత అద్భుతమైన బౌలింగ్‌తో పాటు పాక్ బ్యాటర్ల తప్పిదాలే కారణమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ పేర్కొన్నాడు. ఇమాద్ వసీమ్ ఇన్నింగ్స్ గమనిస్తే.. అతడు ఉద్దేశపూర్వకంగానే…
Jasprit Bumrah surpasses Hardik Pandya in Most T20I Wickets: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై మూడు వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. ఈ రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో ఇప్పటివరకు బుమ్రా 64 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అధిగమించాడు. పాకిస్థాన్‌తో…