WCL 2025: జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్!
- డబ్ల్యూసీఎల్ 2025 నేటి నుంచి ఆరంభం
- మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్
- జులై 20న ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvraj Singh Captain of India Champions in WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 నేటి నుంచి ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ తలపడనున్నాయి. బర్మింగ్‌హామ్ మైదానంలో రాత్రి 9 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. జులై 20న ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మ్యాచ్ జరగనుంది. ఇదే మ్యాచ్‌తో భారత్ తన ప్రయాణం ఆరంభించనుంది. బర్మింగ్‌హామ్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ వ్యవహరిస్తున్నాడు. డబ్ల్యూసీఎల్.. మాజీ క్రికెటర్లకు సంబంధించిన టీ20 టోర్నమెంట్ అన్న విషయం తెలిసిందే.
17 మంది సభ్యులతో కూడిన ఇండియా ఛాంపియన్స్ టీమ్ ఇప్పటికే ఇంగ్లండ్ చేరింది. ఇంగ్లీష్ గడ్డపై మన లెజెండ్స్ ప్రాక్టీస్ ఆరంభించారు. సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్, అంబటి రాయుడు, నమన్ ఓజా, ఆర్పీ సింగ్ వంటి మాజీ ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. 2024లో జరిగిన తొలి ఎడిషన్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. 2025లో మరోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.
Also Read
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- Virat Kohli: "ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది".. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
- CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
ఈ టోర్నమెంట్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు డబ్ల్యూసీఎల్ 2025లో ఆడుతున్నాయి. జులై 18 నుంచి ఆగస్టు 2 మధ్య యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నాలుగు వేదికలలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశలో 15 మ్యాచ్‌లు ఉంటాయి. ప్రతి జట్టు మరొక జట్టుతో ఒకసారి ఆడుతుంది. లీగ్ దశ పూర్తయిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ ఆగస్టు 2న జరగనుంది.
Also Read: David Wiese: టీ20 క్రికెట్‌లో నమీబియా ప్లేయర్ అరుదైన ఘనత!
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 షెడ్యూల్:
జూలై 18: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
జూలై 19: వెస్టిండీస్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 19: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
జూలై 20: ఇండియా ఛాంపియన్స్ vs పాకిస్తాన్ ఛాంపియన్స్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
జూలై 22: ఇండియా ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – నార్తాంప్టన్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 22: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – నార్తాంప్టన్ – రాత్రి 9 గంటలు
జూలై 23: ఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – నార్తాంప్టన్ – రాత్రి 9 గంటలు
జూలై 24: ఇంగ్లాండ్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – రాత్రి 9 గంటలకు
జూలై 25: పాకిస్తాన్ ఛాంపియన్స్ vs దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – రాత్రి 9 గంటలకు
జూలై 26: ఇండియా ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – హెడింగ్లీ – సాయంత్రం 5 గంటలకు
జూలై 26: పాకిస్తాన్ ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – హెడింగ్లీ – రాత్రి 9 గంటలకు
జూలై 27: దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ vs ఆస్ట్రేలియా ఛాంపియన్స్ – హెడింగ్లీ – సాయంత్రం 5 గంటలకు
జూలై 27: ఇండియా ఛాంపియన్స్ vs ఇంగ్లాండ్ ఛాంపియన్స్ – హెడింగ్లీ – రాత్రి 9 గంటలకు
జూలై 29: ఆస్ట్రేలియా ఛాంపియన్స్ vs పాకిస్థాన్ ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 29: ఇండియా ఛాంపియన్స్ vs వెస్టిండీస్ ఛాంపియన్స్ – లీసెస్టర్‌షైర్ – రాత్రి 9 గంటలకు
జూలై 31: సెమీఫైనలిస్ట్ 1 vs సెమీఫైనలిస్ట్ 4 – ఎడ్జ్‌బాస్టన్ – సాయంత్రం 5 గంటలకు
జూలై 31: సెమీఫైనలిస్ట్ 2 vs సెమీఫైనలిస్ట్ 3 – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
ఆగస్ట్ 2: ఫైనల్ – ఎడ్జ్‌బాస్టన్ – రాత్రి 9 గంటలకు
తాజావార్తలు
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?