సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లోనే పాకిస్తాన్ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.
Harbhajan-Akhtar: భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రీడాభిమానులకు పండగే. అయితే ఈ రెండు జట్లు కలిస్తే మాటల తూటాలు, భావోద్వేగాలు, అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు కూడా మామూలే. కిరణ్ మోరే – జావేద్ మియాందాద్, అమీర్ సొహైల్ – వెంకటేశ్ ప్రసాద్ మధ్య జరిగిన ఘర్షణలు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో నేటి కూడా సజీవంగా ఉన్నాయి. అయితే హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన మాత్రం కొంచెం విచిత్రం.…
ఈ నెల 19 నుండి పాకిస్తాన్-దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అనేక వివాదాలు, సన్నాహాల్లో జాప్యాల తరువాత పాకిస్తాన్ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ ఈ టోర్నమెంట్ థీమ్ సాంగ్ను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రసిద్ధ గాయకుడు అతిఫ్ అస్లామ్ పాడిన 'జీతో బాజీ ఖేల్ కే' తాజాగా విడుదల చేశారు.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే 23న భారత్-పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్లైన్లో విడుదల చేయగానే నిమిషాల్లోనే టికెట్లు ఖతమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి.
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు…
వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పనులన్నీ వదులుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియాల్లో వాలిపోతుంటారు. క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్నది. పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్ల వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్లో ట్రోఫీ జరగనుండగా.. భారత్ మ్యాచ్లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండడంతో ప్రతి టీమ్ టైటిల్ సాధించాలని చూస్తోంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చివరిసారిగా 2013లో భారత్ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు కప్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్…
India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేది క్రీడాభిమానులకు అసలైన ఉత్కంఠను కలిగించే ఓ సంఘటన. క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్లు, సంఘటనలతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ జట్ల మధ్య ఉన్న రైవల్రీపై నెట్ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొస్తోంది. “ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్” పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.…
పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్లో యంగ్ లయన్స్ ఆఫ్ ఇండియా 5-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఓడించింది. భారత్ తరఫున అరిజిత్ హుండాల్ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్ చేశాడు.