ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్లో ట్రోఫీ జరగనుండగా.. భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండడంతో ప్రతి టీమ్ టైటిల్ సాధించాలని చూస్తోంది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చివరిసారిగా 2013లో భారత్ ట్రోఫీ సాధించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు కప్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్…
India Vs Pakistan: భారత్ vs పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అనేది క్రీడాభిమానులకు అసలైన ఉత్కంఠను కలిగించే ఓ సంఘటన. క్రికెట్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు, సంఘటనలతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు ఈ జట్ల మధ్య ఉన్న రైవల్రీపై నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక డాక్యుమెంటరీని తీసుకొస్తోంది. “ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్” పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 7న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.…
పురుషుల జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా మూడోసారి గెలుచుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్లో యంగ్ లయన్స్ ఆఫ్ ఇండియా 5-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ తరఫున అరిజిత్ హుండాల్ సింగ్ అత్యధికంగా నాలుగు గోల్స్ చేశాడు.
ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వైభవ్.. అలీ రజా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.
ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం ముగియడం లేదు. ఇప్పుడు ఐసీసీ రెండు బోర్డుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమయంలో టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని ఐసీసీ పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదిలా ఉంటే, పిసిబి ఇప్పుడు కొత్తగా బ్లాక్ మెయిల్ కు దిగింది. భవిష్యత్తులో…
Ind vs Pak: హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సర్స్ టోర్నీలో భారత్‌కు శుభారంభం దొరకలేదు. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా రాబిన్ ఊతప్ప సేనకు ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది.
T20 Emerging Asia Cup 2024 IND vs PAK: దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మైదానంలో తలపడేందుకు మరోసారి సిద్దమయ్యాయి. ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా శనివారం ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుండగా.. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.…
Champions Trophy 2025 Update: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఐసీసీకి పీసీబీ పంపిన షెడ్యూల్ ప్రకారం.. టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న, ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. లాహోర్, రావల్పిండి, కరాచీలను వేదికలుగా ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్లేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.…
IND vs PAK Match on October 19 in Men’s T20 Emerging Asia Cup 2024: దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు ఈ ఏడాదిలో మరోసారి తలపడనున్నాయి. జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో పురుషుల జట్టు తలపడగా.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మహిళల టీమ్స్ తలపడ్డాయి. ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో దాయాది జట్లు మరోసారి ఢీకొట్టనున్నాయి. అక్టోబర్ 19న ఇండియా…
INDW vs PAKW T20 World Cup 2024 Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో తన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. నేడు కీలక పోరుకు సిద్దమైంది. లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు చావోరేవో. ఇకనుంచి ప్రతి మ్యాచూ కీలకం కాబట్టి పాకిస్థాన్‌పై నేడు గెలిచి తీరాల్సిందే. లేదంటే టోర్నీ ఆరంభ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇంత…