ఆస్ట్రేలియాకు రావడం తనకు చాలా ఇష్టం అని, ఇక్కడ అత్యుత్తమ క్రికెట్ ఆడాను అని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నా.. ఆట ఎపుడూ కొత్త పరీక్ష పెడుతుందన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉందని కోహ్లీ భావోద్వేగం…
Rohit Sharma World Record: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు హిట్‌మ్యాన్ అందుకున్నాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ ఉన్నాడు. ఇప్పటివరకూఈ రికార్డు ఎవరి…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సిడ్నీలో దుమ్మురేపారు. రోహిత్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 121 రన్స్ చేశాడు. కోహ్లీ 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. రోకోలు చెలరేగడంతో భారత్ సునాయాస…
IND vs AUS: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 7 వికెట్లు నష్టపోయిన పోరాడుతోంది. అయితే, ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు.
IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.
అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. 265 పరుగుల టార్గెట్‌ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. మొదటి రెండు వన్డేల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుంది. 17 సంవత్సరాల తర్వాత అడిలైడ్ ఓవల్‌లో భారత్ వన్డే మ్యాచ్‌ను ఓడిపోయింది. భారత్ వన్డే సిరీస్ ఓటమికి ప్రధాన కారణాలు…
ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన టీమిండియా ఘోర ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-1తో వెనకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే గురువారం అడిలైడ్‌లో జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు చేసే అవకాశముంది. రెండో వన్డే మ్యాచ్‌లో ముఖ్యంగా బౌలింగ్‌లో మార్పులు…
Team India loss: ఆదివారం భారత క్రికెట్ అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. పురుషుల, మహిళల క్రికెట్ జట్లు రెండూ కీలకమైన మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా పురుషుల జట్టు తొలి వన్డేలో పరాజయం చెందగా, మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమ్‌ఇండియా పేలవంగా ఆరంభించింది. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బౌన్సీ పిచ్‌పై…
IND vs AUS: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో కంగారు జట్టు 1 -0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
IND vs AUS: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తేలిపోయింది. అనేకమార్లు వర్షం అంతరాయం తర్వాత టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వర్షం ప్రభావంతో మ్యాచ్ 26 ఓవర్లకు పరిమితం చేయగా, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత జట్టు ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ…