మహిళల ప్రపంచకప్ 2025 రెండవ సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. గురువారం (అక్టోబర్ 29) నవీ ముంబైలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సెమీస్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌కు వరుణ దేవుడు అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం వర్షం పడే అవకాశం ఉంది. రోజంతా మేఘావృతమై ఉంటుందని ముంబై వాతావరణ శాఖ తెలిపింది.…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించిన…
India vs Australia 1st T20: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆటను తిరిగి ప్రారంభించడానికి అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఎప్పటిలాగే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. మార్ష్ ఇప్పటివరకు టాస్ గెలిచిన ప్రతిసారీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక భారత ఇనింగ్స్ లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను ప్రారంభించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (19)…
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్‌బెర్రాలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్, వరుణ్, కుల్‌దీప్ స్పిన్ కోటాలో.. హర్షిత్, బుమ్రాలు పేస్ కోటాలో ఆడుతున్నారు. టాస్ గెలిస్తే ముందుగా…
వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సిరీస్‌కు సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు కాన్‌బెర్రాలో మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయినా.. ఇటీవలే ఆసియా కప్ 2025 గెలిచిన ఊపులో ఉండడం, జట్టు పటిష్టంగా కనిపిస్తుండడంతో సిరీస్ గెలవడానికి టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బలంగా ఉండడంతో హోరాహోరీగా మ్యాచ్ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్‌లో…
Shafali Verma: మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరగనున్న సెమీఫైనల్ పోరుకు ముందు భారత జట్టు శిక్షణ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం షఫాలీ వర్మ తాజాగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన శిక్షణా సెషన్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీక రావల్ కాలు, మోకాలి గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సోమవారం…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ కోసం తాము ఓ ప్రణాళికను సిద్ధం చేశామని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ వెల్లడించాడు. అభిషేక్ ఆట కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, వీలయితే మొదటి బంతికే బుట్టలో వేస్తాం అని చెప్పాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని మార్ష్ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్‌మన్. 2025 ఆసియా కప్ 2025లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. టీ20ల్లో…
ఆస్ట్రేలియా, భారత్ మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో బుధవారం రాత్రి జరగనుంది. వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. పొట్టి సిరీస్ అయినా పట్టాలని భారత్ భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఎంపికకు టీ20…
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 8 పరుగులే చేసిన రోహిత్.. రెండో వన్డేలో 73 రన్స్, మూడో వన్డేలో 121 పరుగులు చేశాడు. చివరి వన్డేలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’ అందుకున్నాడు. సిరీస్‌లో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే సిరీస్ ముగియడంతో…
సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్షాన్ని భారత్ 38.2 ఓవర్లలోఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74)లు కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవిశాస్త్రిలతో రో-కోలు మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ క్రికెట్‌తో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం చెందారు. మరోసారి ఆస్ట్రేలియా…