IND vs AUS 4th Test : భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ నేటి నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో నేటి తొలిరోజు ప్రత్యేకం. ఎందుకంటే టీమిండియా, ఆస్ట్రేలియాల ఉత్సాహాన్ని పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు మైదానంలో ఉంటారు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆసీస్ జట్టు మూడో టెస్టులో భారత్‌పై ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.
ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆటతీరును కనబరిచింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియాకు మూడో టెస్టువో మాత్రం ఆస్ట్రేలియా గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.