BCCI Removed Vice Captain Tag From KL Rahul: గతేడాది వరకు కేఎల్ రాహుల్ పరుగుల వీరుడిగా తన సత్తా చాటాడు. చాలాసార్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. గతేడాది నుంచి ఏమైందో ఏమో తెలీదు కానీ, ఫామ్ లేమితో రాహుల్ సతమతమవుతున్నాడు. చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఏడాదికాలంలో అతడు సాధించింది కేవలం ఒక్క అర్థశతకం మాత్రమే. దీంతో.. అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్తా ఉన్న యువ ఆటగాళ్లు ఎందరో ఉన్నారని.. వాళ్లను పక్కనపెట్టి ఫామ్‌లో లేని రాహుల్‌కి చోటు కల్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ లేటెస్ట్‌గా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ పదవిని లాక్కుంది.
Taraka Ratna: తారకరత్న లేకపోవడం చాలా బాధాకరం- వెంకటేష్
ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు భారత జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. అందులో రాహుల్ నుంచి వైస్ కెప్టెన్ ట్యాగ్‌ను తొలగించింది. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే.. మరెవ్వరినీ వైస్ కెప్టెన్‌గా ప్రకటించలేదు. బంగ్లాదేశ్ పర్యటనలో ఛటేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ.. తాజాగా అతడి పేరును కూడా బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌కు, అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో రాహుల్ జట్టును నడిపించాడు. అయితే, అతడి బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. అప్పటినుంచే జట్టులో అతని స్థానంపై సందేహాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. జట్టు లీడర్‌షిప్ గ్రూపులో భాగమైనప్పటి నుంచి.. ఏడు టెస్టులు ఆడిన రాహుల్, కేవలం 175 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గతేడాది, ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు.
Delivery Agent Killed: ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు.. డెలివరీ ఏజెంట్‌ని చంపేశాడు
ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండు టెస్ట్ మ్యాచెస్‌లో.. కేఎల్ రాహుల్ ఏమాత్రం రాణించలేదు. రెండు మ్యాచెస్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతడ్ని తొలగించి, మరొకరికి అవకాశం కల్పించాలని క్రీడాభిమానుల నుంచి రిక్వెస్టులు వస్తున్నాయి. అయినప్పటికీ.. అతనికి జట్టులో చోటు కల్పించడంపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అతని స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ఆసీస్‌తో జరగాల్సిన మిగతా రెండు టెస్టుల్లో రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి.