Australia Got All Out For 113 In Second Test Against India: ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలుత రెండు ఇన్నింగ్స్‌ని శుభారంభం చేసిన ఆస్ట్రేలియా.. మూడో రోజు ఆటలో మాత్రం పేకమేడలా కూలిపోయింది. స్పిన్నర్ల ధాటికి వికెట్లు.. చెట్టుకు కదిలించినప్పుడు ఎండిన ఆకులు రాలినట్టు రాలిపోయాయి. ముఖ్యంగా.. జడేజా ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కంగారు పెట్టించాడు. అతని ధాటికి ప్రతిఒక్కరూ వచ్చినట్టే వచ్చి.. పెవిలియన్ బాట పట్టారు. దీంతో 113 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. జడేజా ఏడు వికెట్లతో విజృంభించాడు.
Turkey Earthquake: 46 వేలు దాటిన టర్కీ భూకంప మృతుల సంఖ్య.. రెస్క్యూ ఆపరేషన్‌కు స్వస్తి
మొదట.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆటను 61/1 పరుగులతో ముగించింది. ట్రావిస్ హెడ్ (43), మార్నస్ లబుషేన్ (35) కాసేపు క్రీజులో కుదురుకోవడంతో.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు భారీ స్కోరు చేస్తుందేమోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. 85 పరుగులకు 3 వికెట్లు కోల్పోయేదాకా.. ఆసీస్ జట్టు పటిష్టంగానే కనిపించింది. కానీ, ఆ తర్వాతే ప్రత్యర్థి జట్టు తుస్సుమంది. అశ్విన్, జడేజా తమ స్వింగ్‌తో చేసిన మాయాజాలం దెబ్బకు.. పిట్టలు రాలినట్టు వికెట్లు పడ్డాయి. ట్రావిస్, మార్నస్ మినహాయిస్తే.. మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ముగ్గురు బ్యాటర్లైతే సున్నా పరుగులకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు తేడా ఆధిక్యంలో ఆసీస్ జట్టు ఉన్నందున.. భారత్ 115 పరుగుల చేస్తే, విజయం సాధిస్తుంది.
Sonu Sood: రాజకీయాల్లోకి సోనూసూద్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటుడు