Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు.. భారత్,…
Pak drone attacks: వరసగా రెండో రోజు దాయాది పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి, సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా 26 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.
భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదని, దేశం ఎంతో సంయమనం పాటించిందన్నారు. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే.. ఇద్దరు ఆడబిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారన్నారు. ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదని, కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగిందన్నారు. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని ఎంపీ రఘునందన్…
Indian forces: భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారామిలిటరీ దళాలు ఉంటాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రతా దళం (BSF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) దళాలు సరిహద్దు రక్షణ దళాలుగా పనిచేస్తాయి. ఇవి మనదేశంలోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తాయి. వీటిలో పాటు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ…
India Pakistan War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలను జారీ చేసింది. భారతదేశ సహాయక సైనిక దళం అయిన టెరిటోరియల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మొత్తం 32 ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను యాక్టివ్ చేసింది.
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్‌లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది.
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.
India Pakistan: పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంలో పాకిస్తాన్ బుద్ధిని ప్రపంచానికి వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.