Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakumanu Rajasekhar Death: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని జగన్ పేర్కొన్నారు. కాగా, కాకుమాను రాజశేఖర్ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన వైఎస్సార్సీపీకి అంకితభావంతో పనిచేశారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని జగన్ గుర్తుచేశారు.
రాజశేఖర్ ఆకస్మిక మరణం తీవ్రంగా బాధించిందని జగన్ తెలిపారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన లేని లోటు పార్టీకి ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్.. కాగా, గతంలో లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర్, ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతి నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. రాజశేఖర్ మృతికి పలువురు వైఎస్సార్సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ఇక, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కు నివాళులు అర్పించారు పార్టీ నేతలు.. కాకుమాను రాజశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జూపూడి ప్రభాకర్, టీజేఆర్ సుధాకర్ బాబు, పుత్తా శివ శంకర్, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తి, కొమ్మూరి కనకారావు, సురేంద్ర, ఇతర నేతలు..
మా పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన లేని లోటు పార్టీకి, వ్యక్తిగతంగా నాకు ఎప్పటికీ పూడ్చలేనిది. రాజశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ… pic.twitter.com/WU401YZvz0
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 24, 2026
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!