Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
- సెప్టెంబర్ 25న మెట్రో సేవలను సెప్టెంబర్ 26 తెల్లవారుజామున 1 గంట వరకు
- అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు 1:00 గంటలకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ 25న హైదరాబాద్ మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1 గంట వరకు పొడిగించింది. దీంతో నిమజ్జన వేడుకలకు వెళ్లే భక్తులు రాత్రివేళ కూడా మెట్రో సేవలను వినియోగించుకోవచ్చు.
సెప్టెంబర్ 25న అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు తెల్లవారుజామున 1:00 గంటలకు బయలుదేరుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించారు.
Also Read
- 7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
- Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తాయి. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వేలాది విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించేందుకు నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలపై ఆంక్షలు, పార్కింగ్ సమస్యలు తలెత్తే అవకాశం లేకుండా.. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!