Indian Army: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల వెంట డ్రోన్లు, మిసైళ్ల ద్వారా విస్తృతంగా దాడులు చేసేందుకు యత్నించింది. అయితే భారత భద్రతా బలగాలు సకాలంలో అప్రమత్తమై ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ దాడులకు ప్రతిగా భారత సైన్యం ఎల్ఓసీ (Line of Control) వెంట పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై ధాటిగా ప్రతీకార దాడులు నిర్వహించింది. Read Also: JD Vance…
Ambati Rayudu: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో మాజీ క్రికెటర్ ట్వీట్ కలకలం రేపింది. మే 8 (గురువారం) నాడు పాకిస్తాన్ భారతదేశంపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయగా.. భారత సైన్యం ఆ దాడిని సమర్థంగా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. Read Also: PSL: పాక్ క్రికెట్ బోర్డు కీలక…
పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్లలో జరగాల్సిన పీఎస్ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. గురువారం రాత్రి పాకిస్థాన్ జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా అనేక నగరాలపై క్షిపణులతో దాడి చేసింది. అయితే.. భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ S-400 క్షిపణులను గాల్లోనే కూల్చివేసి దాడిని అడ్డుకుంది. అలాగే.. పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను భారత్ కూల్చివేసింది. జమ్మూ, పఠాన్‌కోట్, షాపూర్, మాధోపూర్, ఫిరోజ్‌పూర్, జైసల్మేర్‌లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.
మే 6-7 రాత్రి.. ప్రపంచం మొత్తం నిద్రపోతోంది. భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో బిజీగా ఉంది. 30 నిమిషాల ఆపరేషన్‌లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉదయం వరకు దీని గురించి ఎవరికీ అధికారిక సమాచారం లేదు. ఇంతలో ఈ ఘటనపై సైన్యం, విదేశాంగ శాఖ సంయుక్త విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు. సుమారు 10.30 గంటలకు ఒక వ్యక్తి విలేకరుల సమావేశంలో కనిపించారు. ఆయనతో పాటు భారత…
India Pakistan: పాకిస్తాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంలో పాకిస్తాన్ బుద్ధిని ప్రపంచానికి వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది.
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు, మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చించారు.
Pakistan: భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని పాకిస్తాన్ వెన్నులో వణుకుపుడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌లోని 15 నగరాలపై దాడి చేసేందుకు యత్నించింది.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యం భారతదేశానికి లేదని.. కానీ మా దేశంపై సైనిక దాడులు జరిపితే.. గట్టి సమాధానం ఇస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.