India-Pakistan Tensions: భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైయ్యాయి. ఈ పరిణామాల వేళా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మే 9న) సాయంత్రం త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Vikram Misri: గత రాత్రి భారత నగరాలపై, పౌరులపై పాకిస్తాన్ ఉద్దేశపూర్వక దాడులు జరిపింది అని భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు.
Indian Govt: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాసింది కేంద్ర హోంశాఖ. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 వినియోగించుకోవాలని ఆ లేఖలో తెలిపింది.
India Pakistan War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలను జారీ చేసింది. భారతదేశ సహాయక సైనిక దళం అయిన టెరిటోరియల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మొత్తం 32 ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను యాక్టివ్ చేసింది.
Delhi On High Alert: పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పౌరులను అలర్ట్ చేసేందుకు భద్రతా దళాలు సైరన్ల ఏర్పాటు చేశారు. సైరన్లు మోగించి పౌరులను అప్రమత్తం చేసింది ఇండియన్ ఆర్మీ.
High Alert In Rajasthan: భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ లో హై అలర్ట్ ప్రకటించారు. జై సల్మేర్, రాంఘడ్, బడ్ మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్ లో లాంటి సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించబడింది.
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరి కాసేపట్లో ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్ చేస్తున్నారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ రిహార్సల్స్ చేయనున్నారు. వైమానిక దాడుల సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు మోగనున్నాయి.
Pakistan: భారతదేశం చేతిలో ఎన్ని సార్లు భంగపాటుకు గురైనా నాదే పైచేయి అంటుంది పాకిస్తాన్. అబద్ధాలను అవలీలగా ప్రచారం చేస్తుంది. చివరకు పాకిస్తాన్ ప్రభుత్వంలో అగ్ర నేతలుగా చలామణీ అవుతున్న వారు కూడా అబద్ధాలను ప్రచారంలో చేయడంలో పోటీ పడుతున్నారు. తమ పౌరుల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నుంచి పాకిస్తాన్ని భారత్ త్రివిధ దళాలు చితకబాదుతున్నా కూడా బుద్ధి రావడం లేదు.
కాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ నిర్వహించిన సమావేశంలో సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో తాజాగా చర్చించిన అంశాలను ప్రధాని మోడీ దృష్టికి రాజ్నాథ్ తీసుకెళ్లనున్నారు.