Operation Sindoor: పాక్ వ్యాప్తంగా భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత..
- పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ వీరంగం..
- ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా భీకర దాడులు..
- ఎయిర్ స్పేస్ మూసేసిన పాకిస్తాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: భారత్ పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భీకర దాడి చేసింది. ఇదే కాకుండా షార్కోట్‌లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్‌లోని మురిద్ ఎయిర్ బేస్‌పై భారీ దాడులు చేసింది. రావల్పిండితో పాటు ఇస్లామాబాద్‌లో కూడా పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆర్మీకి గుండె లాంటి రావల్పిండినే భారత్ కొట్టింది. రావల్పిండి లోనే రెండు భారీ దాడులు జరిగాయి. అయితే, దీనికి ప్రతీకారం ఉంటుందని పాక్ ఆర్మీ చెప్పింది. దాడిని ధ్రువీకరించింది.
Read Also: Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
మరోవైపు, లాహోర్, సియాల్ కోట్‌లో కూడా భారీ ఎత్తున దాడులు జరిగాయి. లాహోర్‌లోని పాక్ ఆర్మీ డివిజన్‌ని టార్గెట్ చేసింది. ఆర్మీ డివిజన్ నుంచి వాహనాలు బయటకు వెళ్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. ‘‘నోటమ్’’ జారీ చేసింది. మద్యాహ్నం 12 గంటల వరకు దేశ, విదేశ విమానాలకు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. అబుదాబి నుంచి పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానాన్ని క్వెట్టాకు మళ్లించినట్లు తెలుస్తోంది. భారత్ చేసిన దాడుల్లో ఎయిర్ బేస్‌లోెని అన్ని సౌకర్యాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాక్ ఫైటర్ జెట్స్ ఎగరకుండా చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!