Bangladesh: బంగ్లాదేశ్‌కు షాక్.. కేంద్రం కీలక నిర్ణయం..!
- భారత చర్యలకు బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపాటు
- యూట్యూబ్‌లో బ్లాక్ చేసిన జమునా, యాక్టర్ టీవీ, బంగ్లావిజన్, మొహనా
- భద్రత పెంచిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: పాకిస్తాన్‌తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్‌పై కూడా దృష్టి సారించింది. భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న 4 బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ మీడియానే స్వయంగా వెల్లడించింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్‌కు చెందిన 4 వార్తా ఛానెళ్లను భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు. బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానెళ్లలో జమునా టీవీ, యాక్టర్ టీవీ, బంగ్లావిజన్ , మొహనా టీవీ ఉన్నాయి.
Sreenidhi Shetty- Sesh: శ్రీనిధి శెట్టిని మళ్లీ ఆడుకున్న అడివి శేష్.. పంచాయతీ సెటిల్ చేసిన నాని!
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ఈ వారంలోనే భారత్ బంగ్లాదేశ్‌కు మరో షాక్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన 123 మంది చొరబాటుదారులను తిరిగి సరిహద్దు దాటించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఛానెళ్లు భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో భారత్ యూట్యూబ్‌ను ఈ ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. భారత్ నుంచి ఆదేశాలు రాగానే యూట్యూబ్ ఈ ఛానెళ్లపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఈ ఛానెళ్లు భారత్‌కు వ్యతిరేకంగా పూర్తిగా అవాస్తవమైన వార్తలను ప్రచారం చేస్తున్నట్లు తేలింది.
యూట్యూబ్ ఈ ఛానెళ్లకు నోటీసులు కూడా పంపింది. సరైన సమాధానం రాకపోతే ఈ ఛానెళ్లను బంగ్లాదేశ్ నుండి కూడా తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 4 ఛానెళ్లతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన మరో 34 మీడియా సంస్థలను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లోని ఈ ఛానెళ్లపై నిషేధం విధించే ముందు భారత్ పాకిస్తాన్‌కు చెందిన 16 వార్తా ఛానెళ్లను యూట్యూబ్‌లో బ్లాక్ చేయించింది.
బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ఎలాంటి స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. యూనుస్ ఈ మొత్తం విషయంలో వేచి చూసే ధోరణితో ఉన్నారు. అయితే యూనుస్ ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి వారి భయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యూనుస్ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో తమ సైనిక భద్రతను పెంచింది. అలాగే హిందువులపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత చాలా కాలంగా ఒక పెద్ద సమస్యగా ఉంది.
OperationSindhoor: జైశంకర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో ఫోన్..
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!