India Pakistan: గత కొంత కాలంలో పాకిస్తాన్‌లో పలువురు ఉగ్రవాదులు ‘‘గుర్తుతెలియన వ్యక్తుల’’ చేతిలో మరణించారు. బైక్‌పై వచ్చేవారు ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇదే తరహాలో పాకిస్తాన్ వ్యాప్తంగా పలువురు ఉగ్రవాదుల హత్యలు జరిగాయి. అయితే, ఈ చనిపోయిన ఉగ్రవాదులకు భారత్‌లో ఏదో విధంగా సంబంధం ఉండటం గమనార్హం.
Masood Azhar: నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ దాయాది దేశం పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇటీవల పాకిస్తాన్ బహవాల్ పూర్‌లో ఒక ఇస్లామిక్ సెమినరీలో అజార్ ప్రసంగించిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంట్లో అతను భారతదేశంపై దాడులు కొనసాగిస్తామని చెప్పడం, ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన పదాలను ఉపయోగించడం కనిపించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
S Jaishankar: జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ రాజీ పడే పరిస్థితే లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో సానుకూల, ప్రతికూల పరిస్థితుల్లో భారత్ స్పందిస్తుందని అన్నారు. దాయాది దేశంతో ‘‘అంతరాయం లేని చర్చల’’ యుగం ముగిసిందని చెప్పారు.
పాకిస్థాన్ మార్కెట్లలో కూడా భారత్‌తో మెరుగైన సంబంధాల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఇటీవల, పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం భారతదేశంతో వాణిజ్యాన్ని పునః ప్రారంభించవచ్చని సూచించింది.
Pulwama attack architect Asim Munir to be Pakistan's new army chief: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమిలయ్యారు. ప్రస్తుతం సైన్యాధ్యక్షుడిగా ఉన్న కమర్ జావేద్ బజ్వా నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్ అంటే నరనరాన వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు నియమితులైన ఏ సైన్యాధ్యక్షుడు కూడా భారతదేశంతో సత్సంబంధాలను కోరుకోలేదు. దీనికి అనుగుణంగానే మునీర్…
India flood aid to Pakistan: పాకిస్తాన్ గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ వరదలతో అల్లాడుతోంది. ఏకంగా పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ వరదలతో అతలాకుతలం అవుతోంది. 100కు పైగా జిల్లాలు వరద బారినపడ్డాయి. ఇప్పటి వరకు 1000కి పైగా మరణాలు సంభవించగా.. 3 కోట్ల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశాన్ని భారీ వరదలు, వర్షాలు తీవ్రంగా నష్టపరిచాయి. 6 లక్షలకు…