Akhilesh Yadav: ఓ మసీదులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌లు సందర్శించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఇద్దరు నేతలపై విరుచుకుపడుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల పార్లమెంట్ సమీపంలోని ఒక మసీదును సంరద్శించారు. మతపరమైన ప్రాంతంలో రాజకీయా సమావేశాలు నిర్వహించడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ సమావేశంలో డింపుల్ యాదవ్ ధరించిన దుస్తులపై కూడా వివాదం చెలరేగింది.
Read Also: Australia: F*** Off, ఇండియన్.. ఆస్ట్రేలియాలో వ్యక్తిపై జాతివివక్ష దాడి..
బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్ ప్రార్థనా స్థలాన్ని అనధికారికి ఎస్పీ కార్యాలయంగా మార్చారని దుయ్యబట్టారు. “అఖిలేష్ యాదవ్ నిన్న మసీదుకు వెళ్ళాడు. ఆ మసీదు పార్లమెంట్ భవనం ముందు ఉంది. ఎస్పీ ఎంపీ నద్వీ అక్కడి ఇమామ్. మసీదు లోపల రాజకీయ సమావేశం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించారు. ఫోటోలో డింపుల్ యాదవ్ బ్లౌజ్ ధరించినట్లు కనిపిస్తోందని, ఆమె వీపు, పొట్ట కనిపిస్తోందని, డింపుల్ తలపై దుపట్టా కూడా లేదని అన్నారు. ఇది మసీదు లోపల ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధమని, ప్రపంచవ్యాప్తంగా ఇది ఇస్లామిక్ మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. వీరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. మసీదును ఎస్పీ నాయకులు సరదాలకు, ఉల్లాసానికి వేదిక మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ సమావేశంలో దేశవ్యతిరేక కార్యకలాపాల గురించి చర్చించారని అన్నారు.
యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన ప్రదేశాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. అయిత, బీజేపీ ఆరోపణల్ని ఎస్పీ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదం ద్వారా జాతీయ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. బీజేపీ రాజకీయ లాభం కోసం మతాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోందని అఖిలేష్ ఆరోపించారు. డింపుల్ యాదవ్ తన తలపై దుప్పట్టా కప్పుకున్నారు, ఫోటో తీస్తున్న సమయంలో జార వచ్చు అని ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ అన్నారు.