AP,TS Weather: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రైల్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తాయని.. భారత వాతావరణశాఖ హెచ్చరించిన కొన్ని గంటలకే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటూ.. పుణె, నాగపూర్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 మధ్య.. కేవలం 3 గంటల్లో ముంబైలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అరేబియా మహాసముద్రంలో బిపర్‌జోయ్ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ) హెచ్చరించారు. నగరంలో బలమైన గాలులతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గురువారం ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేయడంతో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
భారతదేశం తీవ్రమైన వేసవిని ఎదుర్కొంటోంది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఈరోజు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల జాబితాను విడుదల చేసింది, అగ్రస్థానంలో ఉన్న నగరం 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
వేసవిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు, నాలుగు రోజులలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
Heat Wave Warning: ఏప్రిల్ రెండో వారమే దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ(IMD) వచ్చే పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉంటే వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.