AP,TS Weather: తుఫానుగా మారనున్న వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP,TS Weather: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రైల్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం నాటికి తుపాను మచిలీపట్నం తీరం దాటుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. సోమవారం సాయంత్రం తర్వాత చెన్నై-మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
Read also:Rathnam: విశాల్ ‘రత్నం’ టీజర్ చూశారా.. ఈసారి రక్తపాతమే..
Also Read
భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం మరియు సమాచారం కోసం 24 గంటల కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101 అందుబాటులో ఉంటాయని ప్రజలు గుర్తించాలని కోరారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్ ప్రభావంతో ఆది, సోమవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబరు 3 నుంచి 5 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Rajamouli-Mahesh : రాజమౌళి మహేష్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో..?
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!