Dense Fog : ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా పొగ మంచు కప్పేసింది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో నిండిపోయాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఏర్పాడింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకు తోడు చలి తీవ్ర రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు వల్ల 110 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Read Also: Group 2 Exam: జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా ! మళ్లీ ఎప్పుడంటే?
ఇక, పొగ మంచు ఎఫెక్ట్ తో ఇతర ఎయిర్ పోర్టులకు దారి మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని పేర్కొనింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖా తెలిపింది.
Read Also: CM YS Jagan: మూడు కీలక పథకాలపై జగన్ ఫోకస్.. నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదు అయింది. హరియాణా, యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ తీవ్రస్థాయిలో పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోయింది. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా రోజు రోజుకు క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డ్ అయింది. ఇది చాలా పేలవమైన కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే ఛాన్స్ ఉందన్నారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉంది. అయితే, విపరీతమైన పొగమంచుతో దారి కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారులపై వెహికిల్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి.