టీమిండియా జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు.
Team India Players in Special Jersey: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టు నేడు స్వదేశానికి చేరింది. బార్బడోస్ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ చేరుకుంది. విశ్వవిజేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లిన భారత జట్టు.. అక్కడ కాసేపు సేద తీరింది.…