Team India Players in Special Jersey: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టు నేడు స్వదేశానికి చేరింది. బార్బడోస్ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ చేరుకుంది. విశ్వవిజేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లిన భారత జట్టు.. అక్కడ కాసేపు సేద తీరింది. హోటల్ నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు రోహిత్ సేన వెళ్లింది.
ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీని భారత ప్లేయర్స్ కలుసుకున్నారు. విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను ప్రధాని అభినందించారు. ప్రధానితో కలిసి ప్లేయర్స్ అందరూ అల్ఫాహారం తిన్నారు. అయితే మోడీని కలవడానికి భారత ఆటగాళ్లు స్పెషల్ జెర్సీలో వెళ్లారు. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన జెర్సీ తరహాలోనే ఈ స్పెషల్ జెర్సీ ఉండగా.. స్వల్ప మార్పులు చేశారు. జెర్సీ ముందు భాగంలో ‘ఇండియా’ కింద ‘ఛాంపియన్స్’ అని అదనంగా ముద్రించారు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచినందుకు ఛాంపియన్స్ అని జెర్సీపై ఆడ్ చేశారు.
Also Read: Hardik Pandya Dance: హార్దిక్ పాండ్యా డ్యాన్స్.. నవ్వుకున్న విరాట్ కోహ్లీ!
అలాగే ఎడమవైపు ఉండే బీసీసీఐ లోగోపై రెండు స్టార్లను ముద్రించారు. గతంలో ఒక్క స్టార్ మాత్రమే ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్ విజయానికి గుర్తుగా ఆ స్టార్ ఉండేది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 గెలవడంతో.. రెండు స్టార్లుగా ఛేంజ్ చేశారు. ఈ రెండు మినహా టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన జెర్సీలో మరే మార్పు లేదు. కొత్త జెర్సీకి సంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | BCCI Secretary Jay Shah, President Roger Binny, Indian Captain Rohit Shama along with team India to leave shortly from ITC Maurya to meet PM Narendra Modi pic.twitter.com/s688Gpkc11
— ANI (@ANI) July 4, 2024