హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. మహిళా దినోత్సవ సంబరాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా…
Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఆర్థిక మంత్రివర్గం ఇప్పటికే ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. నిర్మలమ్మ వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో రికార్డు నెలకొల్పారు. బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్.. “వికసిత భారత్” లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ ప్రసంగం ప్రారంభం సమయంలో…
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2025-2031 ఆర్థిక సంవత్సరాల మధ్య 6.7 వృద్ధిరేటు సగటున కలిగి ఉంటుందని, 2031 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. ఇది క్యాపెక్స్ పుష్, ప్రొడక్టివిటీ పెరుగుదల వల్ల సాధ్యం అవుతుందని, కోవిడ్ మహమ్మారికి ముందు దశాబ్ధంలో చూసిన 6.6 శాతం వృద్ధికి సమానంగా
India Growth: ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉంటే భారత్ మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత వృద్ధి 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కూడా ఇదే విషయాన్ని చెప్పింది. భారతదేశం 8 శాతం వార్షిక జీడీపీ వృద్ధిని కొనసాగించగలదని సెంట్రల్ బ్యాంక్ మార్చి బులెటిన్‌లో ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ కథనంలో పేర్కొంది. 2021-24 కాలంలో, స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి సగటున…
India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది.
India Growth: మన దేశం వచ్చే ఏడాది 5 శాతం గ్రోత్ సాధించినా గొప్ప విషయమేనని, అదే జరిగితే మనం అదృష్టవంతులమేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. ఈ ఏడాదితో పోల్చితే వచ్చే సంవత్సరం మరింత కష్టంగా గడవనుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి వేగం మందగించబోతోందని అంచనా వేశారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూపోతున్నాయని, అందుకే గ్రోత్ పడిపోనుందని అభిప్రాయపడ్డారు.