Mukesh Ambani: ప్రధాని మోడీ దేశానికి అజేయమైన రక్షణ..
- భారతదేశానికి మోడీ రక్షణ గోడ..
- ప్రపంచ అనిశ్చితి భారతీయులను తాకలేదు..
- ముఖేష్ అంబానీ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారత్ రక్షించబడిందని, దీనికి కారణం‘‘నరేంద్రమోడీ అనే అజేయమైన రక్షణ గోడ’’ ఉందని అన్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో ప్రసంగించిన అంబానీ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థిలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం భారతీయులపై పడలేదని, భారతదేశానికి నరేంద్రమోడీ అజేయమైన రక్షణ గోడ ఉంది’’ అని అన్నారు.
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
ఈ దశాబ్ధం భారతదేశ భవిష్యత్తును నిర్వచిస్తుందని అన్నారు. 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌కు తీసుకురావాలనే ప్రధానమంత్రి దార్శనికతకు రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుందని, నరన్‌పురాలోని వీర్ సావర్కర్ మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్వహించడానికి, దానిని జాతీయ- అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, అథ్లెట్ శిక్షణకు కేంద్రంగా మార్చడానికి రిలయన్స్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కలిగి ఉంటుందని ఆయన అన్నారు. రిలయన్స్ గత ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల్ని పెట్టిందని చెప్పారు. ఏఐని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో భారత్‌లోనే అతిపెద్ద AI-రెడీ డేటా సెంటర్‌ను నిర్మించే ప్రణాళికలను ఉన్నట్లు చెప్పారు.
జియో భారతదేశం, ప్రపంచం కోసం భారతదేశంలో నిర్మించబడిన” పీపుల్-ఫస్ట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తుందని, ప్రజల రోజువారీ ఉత్పాదకతను మెరుగుపరచడానికి వారి స్వంత భాషలో, వారి స్వంత పరికరాల్లో AI సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?