Mallikarjun Kharge: అమెరికా సుంకాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రధాని మోడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ స్నేహితులు కావచ్చు, కానీ మోడీ దేశానికి శత్రువు అయ్యారని ఆరోపించారు. కర్ణాటక కలబురిగిలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ, ట్రంప్ ఒకరి కోసం ఒకరు ఓట్లు కోరినందున వారు మంచి ఫ్రెండ్స్ గా ఉండవచ్చని అన్నారు.
USA: చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రష్యా అధినేత పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికా, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంతో ఈ మూడు దేశాలు మరింత దగ్గర అవుతున్నాయి. పుతిన్, జిన్‌పింగ్‌లతో మోడీ కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చూస్తే అమెరికాకు కాలుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ తమ నుంచి…
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) మాస్కో పర్యటనకు వెళ్లారు. అయితే, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక సమావేశం జరగబోతుంది.
India On US Tarrifs: భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం సుంకాలు విధించడం, రష్యా నుంచి భారత్ ముడిచమురును దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. అయితే, అమెరికా కామెంట్లపై భారత్ శుక్రవారం ఘాటుగానే స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం ఈ విషయం గురించి మాట్లాడారు. ‘‘మా ఇంధన అవసరాలను తీర్చడంలో, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ద్వారా నిర్ణయం తీసుకుంటాము’’ అని…
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ రోజు వాడీవేడీ చర్చ జరగబోతోంది. ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు లోక్‌సభలో చర్చ జరగనుంది. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సిందూర్‌పై చర్చకు అధికార పక్షం తరుపు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా చర్చలో పాల్గొంటారని…
Maldives President: ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల మాల్దీవుల పర్యటన ముగిసింది. ‘‘ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, ఇప్పడు భారతదేశాన్ని, భారత ప్రజల్ని, భారత ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు.
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు.
బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. 1998లో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు.
భారతదేశం-పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి చెప్పారని ఇండియాటుడే కథనంలో తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నారని మిస్రీ నొక్కిచెప్పారని పార్లమెంటరీ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాక్ వివాదాన్ని ఆపడంలో తన పాత్ర గురించి పదే పదే ప్రస్తావించారు. ట్రంప్ వాదనలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిస్రీ ఈ…