Bangladesh map Controversy: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తాజా చర్య భారతీయుల ఆగ్రహానికి గురి చేసింది. కొందరు ఇండియన్స్ ఈ చర్యను కండకావరమే అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ – పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్‌ను అందజేశారు. ఈ మ్యాప్‌లో భారతదేశంలోని అస్సాం,…
PM Modi Invited to Peace Summit by Trump: ప్రధాని మోడీకి ట్రంప్ నుంచి ఆహ్వానం లభించింది.. అక్టోబర్ 13, సోమవారం షర్మెల్ షేక్‌లో జరగనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. శనివారం చివరి నిమిషంలో ఈ ఆహ్వానం అందిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
Taliban minister: 2021లో ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని చేపట్టిన తర్వాత, తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. రెండు దేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించాయి.
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదరడంపై మోడీ, ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు.
Putin: భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. దక్షిణ రష్యాలోని సోచిలో…
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికే, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భారతదేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు వేరు అంటూ, కాశ్మీర్ తన జీవనాడి అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజులకు, పమల్గామ్‌లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు, ఆసిమ్ మునీర్ దారిలోనే పాక్ ఆర్మీ అధికారులు నడుస్తున్నారు.
Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది.
Turkey: శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను భారతదేశం పాటిస్తోంది. అన్ని వేళల్లో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు ఇదే సూత్రాన్ని వర్తింపచేస్తోంది. ఇప్పటికే, అజర్ బైజాన్‌కు వ్యతిరేకంగా ఆర్మేనియాకు పెద్ద ఎత్తున భారత్ ఆయుధాలను అందిస్తోంది. మరోవైపు, టర్కీకి కూడా చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. టర్కీకి అతిపెద్ద శత్రువుగా ఉన్న సైప్రస్ దేశంలో భారత్ తన రక్షణ సంబంధాలను పెంచుకుంటోంది.