దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇండియా కూటమి సోమవారం సమావేశం కానుంది. ఢిల్లీలో ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష నేతలంతా భేటీకానున్నారు. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు.
ECI Slams Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇండియన్ బ్లాక్‌కి చెందిన నేతలు ఓటు చోరి అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై భారత ఎన్నికల కమిషన్ (ECI) గురువారం స్పందించింది. దొంగ ఓటు అనే పదాన్ని చెత్త పదంగా అభివర్ణించింది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడిగా, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్‌కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు.
జగదీప్ ధన్‌ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది.
దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఇండియా కూటమికి ఇచ్చిన విందులో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ-ఎన్నికల సంఘం ఓట్ల కుట్ర చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఇండియా కూటమి నేతలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఆగస్టు 7న విపక్ష సభ్యులకు డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.
Rajnath Singh: ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ‘‘ఓట్ల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాల అణుబాంబు’’ తన వద్ద ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల సంచనల వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం తీవ్రంగా విమర్శించారు. ఆ అణుబాంబును పేల్చాలని సవాల్ విసిరారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్‌పై తీవ్ర రగడ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.